Father harassment: ఓ న్యాయవాది తన కనుపాపల పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. పదేళ్ల కుమారుడిపై మానవత్వాన్ని మంటగలిపి చిత్రహింసలకు గురి చేశాడు. ఈ ఘటన సరూర్‌నగర్ డాక్టర్స్ కాలనీలో చోటుచేసుకుంది.
డాక్టర్స్ కాలనీకి చెందిన న్యాయవాది దేవులపల్లి సంతోషకుమార్కు ఉమా మహేశ్వరితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం భార్యతో ఏర్పడిన తగాదాల నేపథ్యంలో వేర్వేరుగా ఉంటున్నారు. న్యాయస్థానం ఆదేశం మేరకు నాలుగు నెలల క్రితమే ఇద్దరు పిల్లలను తండ్రికి అప్పగించారు.
అప్పటినుంచి భార్యపై కోపాన్ని 10 ఏళ్ల వయసున్న కుమారుడిపై చూపించాడు. తండ్రి పెట్టే చిత్రహింసలు భరించలేని బాలుడు పారిపోయి తల్లి వద్దకు చేరుకున్నాడు. పిల్లవాడి ఒంటిపై ఉన్న గాయాలు చూసి ఉమా మహేశ్వరి తల్లడిల్లింది. బాధిత బాలుడిని తీసుకుని సరూర్‌నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి: అమానవీయం.. కన్నకూతురినే కాటేసిన కామాంధుడు.. రెండో భార్య ఫిర్యాదుతో వెలుగులోకి..