అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కనుమరుగైపోయింది. కంటి కింద కణితిని తొలగించాలని ఆస్పత్రికి వెళ్లిన తల్లిదండ్రులకు.. పాప శవాన్ని అప్పగించారు వైద్యులు. ఆనందంగా ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ చిట్టితల్లి.. తిరిగిరాని లోకాలకు చేరడంతో కన్నవారికి కడుపుకోత మిగిలింది. ఏపీలోని గుంటూరు జిల్లాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరాధ్య(12) మృతి చెందింది. కంటి కింద కణితి తొలగించాలని చికిత్స కోసం జీజీహెచ్‌లో చేరిన ఆరాధ్య.. కొద్దిసేపటి క్రితం మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. శస్త్ర చికిత్స తర్వాత ఆరాధ్య పరిస్థితి విషమించడంతో.. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ నుంచి రమేశ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడా వెంటిలేటర్‌కే పరిమితమైన ఆరాధ్య.. మరణించిందని వైద్యులు తెలిపారు. మరోవైపు వైద్యం వికటించి.. ఆరాధ్య వెంటిలేటర్‌పైకి చేరినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఇదీ జరిగింది: నగర శివారు అంకిరెడ్డిపాలానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతుల కుమార్తె ఆరాధ్య. 12 ఏళ్ల పాపకు కంటి కింద చిన్న కణితి ఏర్పడింది. చిన్నారి ఎదుగుతున్న కొద్దీ కణితి ఇబ్బందికరంగా మారుతుందని భావించిన తల్లిదండ్రులు... దానిని తొలగించేందుకు జీజీహెచ్ వైద్యులను సంప్రదించారు. శనివారం చిన్నారికి చికిత్స చేసి.. కణితి తొలగిస్తామని వైద్యులు చెప్పగా.. ఆస్పత్రిలో చేర్పించారు. ఆపరేషన్‌కి తీసుకెళ్లేప్పుడు ఆడుతూ పాడుతూ ఉన్న తమ చిన్నారి.. చికిత్స సమయంలో పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై ఉంచుతున్నామని వైద్యులు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమార్తెకు ఏమైందో కూడా సరిగా చెప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..: