ETV Bharat / crime

Land Occupation: ప్రభుత్వ భూమి కబ్జా... అధికారులు ఏం చేశారంటే..

అది రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి. రెండేళ్ల కిందట ఓ కబ్జాదారుడు దాన్ని తనపరం చేసుకున్నాడు. ఈ విషయం పసిగట్టిన ‘ఈనాడు’ ఈ బాగోతాన్ని అప్పట్లో వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంపై స్పందించిన రెవెన్యూ అధికారులు సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకుని ‘ఇది సర్కార్‌ స్థలమంటూ’ బోర్డు పెట్టారు. రోజులు గడిచిపోయాయి.. కరోనా సమయంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో బోర్డును పీకిపారేసి అదే భూమిని రెండోసారి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అధికారులు ఏం చేశారంటే..

Land Occupation
ప్రభుత్వ భూమి కబ్జా
author img

By

Published : Jul 9, 2021, 12:26 PM IST

రాజేంద్రనగర్‌ డివిజన్‌ బుద్వేల్‌ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 89లో ఎకరా స్థలం ప్రభుత్వానికి చెందింది. ఖరీదైన ఈ స్థలంపై గతంలోనే కబ్జాదారుల కన్ను పడింది. స్థానిక నేతల సహకారంతో కబ్జాలకు ప్రణాళికలు రచించారు. రెవెన్యూ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులను మచ్చిక చేసుకొని ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా రికార్డులు మార్చారు. ఎకరా భూమిని ఓ రియల్టర్‌ దర్జాగా కబ్జాకు పాల్పడ్డాడు. ఈ మొత్తం బాగోతాన్ని 2019 మార్చి నెలలో ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. అయితే తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ వెంటనే రంగంలోకి దిగి సర్వే నెంబర్‌ 89లో ప్రభుత్వ స్థలం ఉందని రికార్డుల్లో గుర్తించారు. తరువాత అక్కడ మరోసారి సర్వే చేయించి నిర్ధారణకు వచ్చారు.

కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టారు. అయితే ఏడాది కాలంగా కరోనా నివారణ చర్యల్లో అధికారులు నిమగ్నం కాగా.. కబ్జాదారులు మాత్రం ఆక్రమణలపై దృష్టి సారించారు. ప్రభుత్వ స్థలమంటూ ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి మళ్లీ అక్కడ నిర్మాణాలకు పూనుకున్నారు. ఇటీవల తాజాగా అక్కడ ఓ గదితో పాటు ప్రవేశ ద్వారాన్ని నిర్మించారు. ఈ విషయంపై జూన్‌ 27న ‘బోర్డు పీకేశారు...జెండా పాతేశారు’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలం ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ను ఆదేశించారు.

సర్వే నెంబర్‌ 89లో ప్రభుత్వ స్థలం ఉన్నమాట వాస్తవమే. గతంలో సర్వేయర్‌ చేసిన పొరపాటు కారణంగా స్థలంలో ప్రైవేటు వ్యక్తులు పాగా వేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం వేలం వేయడానికి అవకాశం ఉన్న భూముల వివరాలను పంపమనడంతో ఈ స్థలం కూడా అందులో ప్రతిపాదించాం. కబ్జాకు గురైనట్లు గుర్తించి ఉదయమే స్థలం వద్దకు చేరుకున్నాం. పోలీసుల బందోబస్తు నడుమ నిర్మాణాలను కూల్చివేశాము. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే... వెంటనే స్వాధీనం చేసుకొంటాం. అవసరమైతే కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం.

-చంద్రశేఖర్‌, తహసీల్దార్‌

త్వరలోనే ఈ స్థలం చుట్టూ ప్రహరి గోడ నిర్మిస్తున్నట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలనుకునే వారిపై క్రిమినల్​ కేసులు పెడతామని హెచ్చరంచారు.

ప్రభుత్వ భూమి కబ్జా

ఇదీ చూడండి: HARITHA HARAM: మీరు నాటేస్తే.. మేం వేటేస్తాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.