Gold seize in shamshabad airport: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడికి చెందిన లగేజిని అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఎలక్ట్రిక్ డీసీ కన్వెర్టర్‌లో దాచుకుని బంగారం తెచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ప్రయాణీకుడి వద్ద నుంచి రూ.15.71 లక్షల విలువైన 316.40 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ పోర్టు కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:
Theft in three Temples : మూడు ఆలయాల్లో చోరీ.. విగ్రహాలు, నగదు అపహరణ