ETV Bharat / crime

Gold smuggling in Shamshabad Airport: సూట్​కేస్​ హ్యాండిల్​లో బంగారం... ఎలా దొరికాడంటే..

author img

By

Published : Nov 27, 2021, 7:43 PM IST

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుబడింది(gold smuggling in hyderabad airport). రూ.20 లక్షలు విలువచేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం(gold seized in shamshabad airport) చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో... సూట్​కేస్​ హ్యాండిల్​లో బంగారాన్ని గుర్తించారు.

సూట్​కేస్​ హ్యాండిల్​లో బంగారం... సీజ్​చేసిన​ అధికారులు

అక్రమ బంగారం సరఫరాకు(Gold smuggling in hyderabad airport) శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారుతోంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలోకి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టులో లక్షల రూపాయలు విలువ చేసే బంగారం పట్టుబడింది.

సూట్​కేస్​ హ్యాండిల్​లో..

అక్రమంగా బంగారాన్ని దుబాయి నుంచి శంషాబాద్‌కు తీసుకువచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి విమానంలో వచ్చిన ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్‌ అధికారులు అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా... టాల్‌కమ్‌ పౌడర్‌లో రూ.20 లక్షలు విలువ చేసే బంగారం ఎవరూ గుర్తించకుండా సూట్‌కేస్‌ హ్యాండిల్​లో ఉంచి తీసుకువచ్చాడు. అతని కదలికలపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు అధికారులు బంగారం స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

Thief Arrest in Hyderabad : హైదరాబాద్​లో గజదొంగ అరెస్టు.. 180 తులాల బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.