‘నాన్న నిత్యం మద్యం తాగొచ్చి అమ్మతో గొడవపడుతున్నాడని, కుటుంబ సభ్యులందర్నీ కొడుతున్నాడని’ పేర్కొంటూ ఓ బాలిక(12) సోమవారం జగిత్యాల పట్టణ పోలీసులను ఆశ్రయించింది. నేరుగా స్టేషన్‌కు వచ్చిన బాలిక.. ఎస్‌ఐ నవత ఎదుట తన బాధను వెళ్లగక్కింది. ప్రతిరోజూ ఇంట్లో జరుగుతున్న గొడవలు, వాటివల్ల తనతోసహా కుటుంబ సభ్యులు మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ కన్నీటిపర్యంతమైంది.
స్పందించిన ఎస్‌ఐ బాలిక ఇంటికి వెళ్లి, ఆమె తండ్రికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇకనైనా మారాలని హితవు పలికారు. ఇకపై ఎప్పుడు సమస్య పునరావృతమైనా డయల్ 100కు సమాచారమిస్తే తానొస్తానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఇదీ చదవండి: ECET: నేడే ఈసెట్.. ఒక్క నిమిషం నిబంధన వర్తింపు