ETV Bharat / crime

తెల్లవారుజామున బయటకు వెళ్లిన బాలికపై అత్యాచారం..! ఆపై హత్య - girl rape in vikarabad district

చిట్యంపల్లిలో దారుణం
చిట్యంపల్లి శివార్లలో బాలిక మృతదేహం.. అత్యాచారం చేసి హత్య!
author img

By

Published : Mar 28, 2022, 10:31 AM IST

Updated : Mar 29, 2022, 8:53 AM IST

10:29 March 28

చిట్యంపల్లిలో దారుణం

girl dead body found: ఇంట్లో నిద్రించిన పదిహేనేళ్ల బాలిక.. తెల్లవారేసరికి పొదలమధ్య శవమై కనిపించింది. అత్యాచారం చేసి ఆమెను చంపి ఉంటారని భావిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. పూడూరు మండలానికి చెందిన ఆ బాలిక (15) పదో తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఎప్పటిమాదిరిగా ఇంట్లో నిద్రించిన ఆమె సోమవారం ఉదయం ఇంటికి కొద్దిదూరంలోని నిర్మానుష్య ప్రదేశంలో పొదలమధ్య శవమై కనిపించింది. రాయితో కొట్టినట్లు ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

లైంగిక దాడికి పాల్పడిన అనంతరం హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు కావలి మహేందర్‌తోపాటు మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టి ఆదివారం రాత్రి మిత్రులను ఆహ్వానించి విందు చేసుకున్నట్లు తెలిసింది. అప్పటికే ఉన్న పరిచయంతో తెల్లవారుజామున బాలికను మహేందర్‌ నిర్మానుష్య ప్రదేశానికి రప్పించినట్లు అనుమానిస్తున్నారు. సామూహిక అత్యాచారం జరిగిందా లేదా ఒకరే లైంగిక దాడికి పాల్పడ్డారా? అనేది ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌లు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. అదనపు ఎస్పీ రషీద్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీంలను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు.

Last Updated : Mar 29, 2022, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.