ETV Bharat / crime

ఆగని ఆకృత్యాలు... కాసుల కోసం కడుపులోనే హత్యలు! - తెలంగాణ వార్తలు

నాగరికత పెరుగుతున్నా సమాజంలో ఆడపిల్లలపై మాత్రం వివక్ష తగ్గడం లేదు. పుట్టబోయేది ఆడ శిశువు అని తెలిస్తే చాలు కడుపులోనే కరిగించేస్తున్నారు. కొంత మంది వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కాసుల కోసం కక్కుర్తి పడి పసి మొగ్గలను ఆదిలోనే అంతమొందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తూ దందా కొనసాగిస్తున్నారు.

gender-diagnosis-in-private-hospitals-and-kousalya-multi-speciality-hospital-seized-in-kamareddy-district
ఆగని ఆకృత్యాలు... కాసుల కోసం కడుపులోనే భ్రూణహత్యలు!
author img

By

Published : Jul 20, 2021, 11:55 AM IST

Updated : Jul 20, 2021, 2:21 PM IST

కాసుల కోసం కక్కుర్తి.. ఆస్పత్రి సీజ్

సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా... నేటికీ పలు ప్రాంతాల్లో లింగవివక్ష కొనసాగుతూనే ఉంది. చాలామంది తల్లిదండ్రులకు ఆడపిల్లలంటే ఇప్పటికే చిన్నచూపే. సృష్టికి మూలమైన స్త్రీలపై వివక్ష తప్పడం లేదు. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య క్రమేణా తగ్గిపోతుంది. ఆడబిడ్డ కడుపులో పడిందని తెలిస్తే చాలు కడుపులోనే కరిగించేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రి భ్రూణహత్యలకు కేంద్రంగా మారింది. ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలు నిబంధనలను తుంగలో తొక్కి... అడిగినంత ఇస్తే ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్య శాఖ అధికారులు తనిఖీలు చేసి... ఆ ఆస్పత్రిని సీజ్ చేశారు.

ధరణి పరిడమిల్లాలంటే జననం తథ్యం. అమృతం లాంటి కమ్మనైన అమ్మతనానికి ఆడ జన్మే ఆధారం. ఇదంతా జగమెరిగిన సత్యం. కానీ.. ఆ తల్లిపేగే ఆడపిల్ల అని తెలిస్తే నులిమేస్తోంది. ఆప్యాయతను పంచాల్సిన తండ్రి హృదయమే ఆ పిండాన్ని చిదిమేస్తోంది. కాసుల కోసం కక్కుర్తి పడి కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ ఆకృత్యానికి తెరలేపుతున్నాయి. మూడో కంటికి తెలియకుండానే కడుపులోనే ప్రాణాన్ని హరించేస్తున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా.. సమాజంలో మాత్రం మార్పు రావడం లేదు. తల్లిదండ్రుల ఆలోచన మారడం లేదు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో 'అమ్మ'తనమే కరవవుతుందోమో!

ఆస్పత్రి సీజ్

జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తున్న కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని స్పెషల్ టీం అధికారులు సీజ్ చేశారు. ఆస్పత్రి వైద్యులుగా చెలామణి అవుతున్న డా.సిద్దిరాములును అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర గర్భస్థ పూర్వ లింగ నిర్ధరణ చట్టం అధికారులు ఇటీవల సాధారణ వ్యక్తుల మాదిరిగా ఓ గర్భిణీని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు తెలిపారు. లింగ నిర్ధరణ కోసం రూ.6 వేలు వైద్యునికి చెల్లించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని వెల్లడించారు. ఎలాంటి అర్హత లేకున్నా బ్రూణ హత్యలకు పాల్పడుతున్నట్లు విచారణలో గుర్తించినట్లు వివరించారు. ఆ ఆస్పత్రిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

సంపాదనే పరమావధి

లింగ నిర్ధరణ పరీక్షల నియంత్రణ చట్టం ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నా సంపాదనే పరమావధిగా మార్చుకున్నారు కొందరు వ్యక్తులు. అర్హత లేకున్నా అబార్షన్లు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గుర్తింపు పొందిన ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, స్కానింగ్, డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఉండగా... కేవలం 12 మంది మాత్రమే రేడియాలజిస్ట్‌లు ఉన్నారు. పీసీపీఎడీటీ చట్టం పరిధిలో పని చేస్తున్న కేంద్రాలు 115 ఉన్నాయి.

కఠిన చర్యలు

ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాలతో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టాం. సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నాం. బాధితుల ఆరోపణలు నిజమని తేలింది. అర్హత లేని వైద్యులు గర్భస్రావం చేస్తున్నారు. అంతేకాకుండా చట్టవ్యతిరేకంగా లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నట్లు తేలింది. ఈ ఆస్పత్రిని సీజ్ చేశాం. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి.

-చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి

వైద్యారోగ్య శాఖ అధికారులు ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల తీరు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఇక డెకాయిట్ ఆపరేషన్‌కు వెళ్లేటప్పుడు అధికారులే సమాచారం ఇస్తుండటంతో ప్రయోజనం లేకుండా పోతుందని అంటున్నారు. లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారని బాధితులు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి: Pegasus Software: ఒక్క మిస్డ్​కాల్​తో ఫోన్​ హ్యాక్​!

Last Updated : Jul 20, 2021, 2:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.