ETV Bharat / crime

గ్యాస్​ లీకై మంటలు.. లక్షల మేర నష్టం - hyderabad news today

గ్యాస్​ లీకై ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. అవి కాస్తా ఎగిసిపడి గుడిసె మొత్తం దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేని కారణంగా ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన వనస్థలిపురం పరిధిలోని ఇంజాపుర్​లో జరిగింది.

Gas leak fires Lakhs of rupees damage at vanasthalipuram
గ్యాస్​ లీకై మంటలు.. లక్షల మేర నష్టం
author img

By

Published : Mar 12, 2021, 3:58 PM IST

గ్యాస్​ లీకై మంటలు.. లక్షల మేర నష్టం

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి ఇంజాపుర్​లోని తుల్జా భవాని కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగి గుడిసె దగ్ధం అయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో స్థానికులు గమనించి... మంటలను ఆర్పీ గుడిసెలో సిలిండర్​ను బయటకి తీసేశారు. ఇంట్లో ఉన్న వివిధ గృహోపకరణాలు పూర్తిగా కాలిపోవడం వల్ల.. సుమారు రెండు లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఆ ఇంటి యజమాని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : మద్యం దుకాణం​లో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.