హైదరాబాద్ నగర శివారు శేరిలింగంపల్లి పరిధి రైల్ విహార్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇంటి పైకప్పు శిథిలాల కింద నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులు రాజస్థాన్‌కు చెందిన వారు కాగా.. నగరానికి వలస వచ్చి రైల్ విహార్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఐస్‌క్రీమ్ తయారు చేస్తుండగా సిలిండర్ పేలడంలో ఈ ఘటన చోటుకున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి..
ప్రియుడితో కలిసి కన్నబిడ్డను చంపేసిన తల్లి.. అదే కారణం..!
డ్రైనేజ్‌లో పడిన వ్యక్తి.. మరో 2 నిమిషాలు లేట్ అయితే ప్రాణాలకే ప్రమాదం.. ఇంతలో...