హైదరాబాద్ సోమాజీగూడలోని ద పార్క్ హోటల్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి 7 కిలోల గంజాయి, ఓ యాక్టివా వాహనం, చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన మనోహర్ సింగ్ అనే వ్యక్తి బట్టల దుకాణాల్లో పనిచేస్తూనే బయట గంజాయి విక్రయిస్తున్నాడని తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన శీను అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తున్నాడని పేర్కొన్నారు. సోమాజీగూడ ద పార్కు హోటల్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద తన యాక్టీవా వాహనంలో గంజాయి ఉంచుకుని విక్రయించేందుకు ఉండగా పట్టుకున్నామని పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి: GANJA SEIZED: భారీ మొత్తంలో గంజాయి పట్టివేత