ETV Bharat / crime

Gang War Video viral: రద్దీ రోడ్డుపై కర్రలు, రాడ్లతో గ్యాంగ్​ వార్​.. వీడియో వైరల్​.. - వీడియో వైరల్

Gang War Video viral: వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ యువకున్ని కొంత మంది యువకులు కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Gang War on Road at meetpet and video viral

author img

By

Published : Feb 7, 2022, 3:26 PM IST

రద్దీ రోడ్డుపై కర్రలు, రాడ్లతో గ్యాంగ్​ వార్​.. వీడియో వైరల్​..

Gang War Video viral: రంగారెడ్డి జిల్లా మీర్​పేట్ పోలీస్​స్టేషన్ పరిధిలోని బడంగ్​పేట్ నగరపంచాయతీ ముందు జరిగిన దాడి.. ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. రాత్రిపూట రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిపై కొంత మంది యువకులు కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.

దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న మిగతావారు పట్టుకుని ఇష్టమున్నట్టు కొట్టారు. ఈ దాడికి సంబంధించి దృశ్యాలు అక్కడే ఉన్న ఓ దుకాణపు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా.. ఇప్పుడు ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ ఘటనపై ఎలాంటి సమాచారం లేదని.. ఫిర్యాదులు కూడా అందలేదని మీర్​పేట్​ పోలీసులు తెలిపారు. అసలు ఈ ఘర్షణకు దారి తీసిన కారణాలేంటీ..? దాడి చేసిన వాళ్లేవరు..? బాధితుడు ఎవరు..? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.