ETV Bharat / crime

ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​ - హుజుర్ నగర్

తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠాను సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని.. జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు.

Gang arrested in temple robbery case in two telugu states in suryapet
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​
author img

By

Published : Mar 24, 2021, 2:35 PM IST

తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డ ఓ ముఠాను సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి.. 8తులాల బంగారం, 9.5 కేజీల వెండి, రూ. 28 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు.. ఎస్పీ భాస్కరన్ తెలిపారు.

నిందితులను.. మఠంపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు పోలీసులు. జల్సాలకు అలవాటు పడి చోరీలు చేసినట్లు ఎస్పీ వివరించారు. చింతలపాలెం మండల కేంద్రంలో.. ఓ ఏటీఎంలో సైతం చోరీకి యత్నించినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

ఇదీ చదవండి: గ్యాస్​ సిలిండర్ల లారీ బోల్తా... డ్రైవర్​కు స్వల్ప గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.