ETV Bharat / crime

లక్కీ డ్రా పేరిట మోసం.. ముఠా అరెస్ట్ - జగిత్యాల జిల్లాలో లక్కీ డ్రా మోసం

బహుమతుల ఆశ చూపి.. అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు దోచేస్తున్నారు మోసగాళ్లు. లక్కీ డ్రాల పేరిట అమాయకులను నిలువున ముంచేస్తున్నారు. ఇలాగే అక్రమాలకు పాల్పడిన ఓ ముఠాను జగిత్యాల రూరల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

Fraud in the name of lucky draw  Gang arrest in mothey jagityal
లక్కీ డ్రా పేరిట మోసం.. ముఠా అరెస్ట్
author img

By

Published : Mar 15, 2021, 3:29 PM IST

జగిత్యాల జిల్లా మోతెలో లక్కీ డ్రా నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల నుంచి నిందితులు.. రూ. లక్షకు పైగా దండుకున్నట్లు వారు గుర్తించారు.

నిర్వాహకులు.. వారానికి రూ.3వందల చొప్పున వసూలు చేస్తూ లక్కీ డ్రా నిర్వహించేవారు. తొలుత కొంత మందికి బహుమతులు ఇచ్చి.. రాను రాను మిగతా వారిని మోసం చేస్తూ దందా మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్‌ పోలీసులు.. లక్కీ డ్రా నిర్వహిస్తుండగా నిందితులను పట్టుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి: 140 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.