ETV Bharat / crime

70 కేసుల గజ మోసగాడు అరెస్ట్ - తూర్పు గోదావరి క్రైమ్ వార్తలు

అమాయకులను నమ్మించి మోసం చేయడమే అతడి పని. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. లక్షలు దండుకుంటాడు. ఇన్సూరెన్స్ ఇప్పిస్తానని.. డబ్బులు వసూలు చేస్తాడు. ఉన్నతాధికారిలా నమ్మించి.. ముంచేసి పోతాడు. అలా 70 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ గజ మోసగాడిని ఏపీ, అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

70cases- arrest
గజ మోసగాడు
author img

By

Published : May 24, 2021, 7:54 PM IST

ఏపీ, అనంతపురం జిల్లా వెలమద్దికి చెందిన రాచపల్లి శ్రీనివాస్.. సులభంగా డబ్బు సంపాందించాలనే లక్ష్యంతో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అందుకోసం ఉన్నతాధికారిలా వేషాలు వేసేవాడు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచేసేవాడు. అలా మోసాలకు పాల్పడి 70 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ గజ మోసగాడు.. ఇప్పుడు పోలీసులకు చిక్కాడు.

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన సత్యంద్ర అనే రైతుకు చెందిన ఎద్దులు.. గతంలో విష ప్రభావంతో మృతి చెందాయి. విషయం తెలిసిన నిందితుడు శ్రీనివాస్.. తాను విజిలెన్స్ డీఎస్పీని అంటూ ఫోన్​లో రైతుతో పరిచయం చేసుకున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వారితో మృతి చెందిన ఎద్దులకు రూ. 45 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. రైతు నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత రైతుకు అనుమానం వచ్చి.. సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రైతు ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న మధ్యాహ్నం విజయవాడ నుంచి విశాఖ వెళ్తోన్న శ్రీనివాస్​ను ప్రత్తిపాడు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నిందితుడిపై వివిధ ప్రాంతాల్లో 70కి పైగా కేసులు ఉన్నట్లు వారు గుర్తించారు. బెంగళూరులోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉండి.. పలుమార్లు జైలుకి కూడా వెళ్లివచ్చినట్లు తెలిపారు.

అనంతపురం జిల్లా కదిరి పోలీస్ స్టేషన్​లో శ్రీనివాస్ గతంలో జీప్​ డ్రైవర్​గా పనిచేసేవాడు. పోలీసులతో కలిసి పని చేయడం వల్ల.. ఆ వేష భాషలపై ప్రావీణ్యం సంపాదించాడు. తర్వాత ఉద్యోగం మానేసి ఇలా నేరాలు చేయడం మెుదలుపెట్టి చివరకు కటకటాల పాలయ్యాడు.

ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే చోరీ చేసిన ఇల్లాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.