ETV Bharat / crime

Thieves arrest : డ్రైవర్​ను బెదిరించి దోపిడీకి పాల్పడ్డ నిందితుల అరెస్ట్ - పెద్దపల్లి డీసీపీ రవీందర్ తాజా వార్తలు

పెద్దపల్లి జిల్లా గంగానగర్ వద్ద బొగ్గు లారీ డ్రైవర్​ను కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ నలురుగు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసులకు డీసీపీ రవీందర్ నగదు రివార్డును అందజేశారు.

four thieves arrested in peddapalli district
దొంగల ముఠా అరెస్ట్
author img

By

Published : May 29, 2021, 8:21 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగా నగర్ వద్ద బొగ్గు లారీ డ్రైవర్​ను కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కత్తితో పాటు 9 వేల రూపాయల నగదు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు. ఈనెల 28న గోదావరిఖని ఫైవ్ ఇంక్లైన్ ఏరియా నుంచి గంగానగర్ వెళ్తున్న బొగ్గు లారీని నలుగురు వ్యక్తులు ఆపి... డ్రైవర్​కు కత్తి చూపించి చంపుతామంటూ బెదిరించి అతని వద్ద ఉన్న 9 వేల నగదును తీసుకుని ఉడాయించారు.

వెంటనే డ్రైవర్ మహమ్మద్ తాజ్ పాషా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... నిందితులు కాకినట్ల మణికంఠ, గడ్డం అరుణ్ కుమార్, ధనాల వరప్రసాద్, నీలపు దుర్గాప్రసాద్​లను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. వెంటనే కేసును ఛేదించిన వన్ టౌన్ సీఐ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, పోలీసు సిబ్బందిని డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేనందర్​లు అభినందించి నగదు రివార్డులను అందించారు.

ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.