ETV Bharat / crime

నగరంలో మత్తు పదార్థాల విక్రయం.. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు - Drugs case at pangagutta

Four People Arrested for Supplying Drugs : హైదరాబాద్‌ పంజాగుట్ట ఠాణా పరిధి అమీర్‌పేటలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆల్ఫాజోలం విక్రయిస్తుండగా నిందితులను హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు, పోలీసులు సంయుక్తంగా కలిసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన ఆల్ఫాజోలం సరకు స్వాధీనం చేసుకున్నారు.

Four people were arrested for supplying drugs
మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్
author img

By

Published : Jan 13, 2023, 7:31 PM IST

Four People Arrested for Supplying Drugs : కొందరు యువకులు అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించాలని, తొందరగా ధనవంతులు అవ్వాలని చట్టానికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. అందులో ప్రధానంగా డ్రగ్స్ సరఫరావైపే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. చివరకు పోలీసులకు చిక్కి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్​లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుండగా నలుగురు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు, 5 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎస్.ముత్తు కుమార్(32), ఎ.సౌందర రాజన్​(45)లతో యోగేశ్​, మహేశ్వర్​లు పరిచయం పెంచుకున్నారు. వీరు మత్తు పదార్థాలను అక్రమంగా వారికి రవాణా చేసేవారు. దీంతో పాటు నకిలీ కందిపప్పును కూడా పంపిణీ చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు డిసెంబర్​ 12న నార్కోటిక్​ ఎన్​పోర్స్​మెంట్​ వింగ్​ సహాయంతో అమీర్​పేటలోని అహ్మద్​ కమర్షియల్​ కాంప్లెక్స్ వద్ద ముత్తు, సౌందర​ రాజన్​లు కేజీ ఆల్ఫాజోలం మత్తు పదార్థాన్ని విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో భరత్​, గంగాధర్​ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన యోగేశ్, మహేశ్వర్​లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో, రాష్ట్రం మీదుగా గంజాయి, డ్రగ్స్‌ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. అదే స్థాయిలో వినియోగమూ పెరిగిపోతోందని పోలీసులు తెలిపారు. యువత ఇలాంటి పనులు చేయకుండా ఉండాలని, వారి జీవితం పట్ల శ్రద్ధ కలిగి జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. డ్రగ్స్​కు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే తమకు అందించాలని కోరారు. అదే విధంగా ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. మత్తు పదార్థాలు అక్రమ రవాణా లేకుండా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.