సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అలిరాజ్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి చెందారు. ఆటోలో ఉన్న కనకయ్య, కవితలు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నలుగురు క్షతగాత్రులను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వారిని గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. జగదేవపూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా.. అలిరాజ్‌పేట వద్ద లారీని ఢీకొంది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో జగదేవపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల రోదనలు పలువురిని కలచివేశాయి.
ఇవీ చదవండి: