Gas Cylinder leakage in Bachupally : హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కౌసల్య కాలనీలోని సుఖి 9 అపార్ట్మెంట్లో వంట గ్యాస్ లీకయ్యి మంటలు అంటుకున్న ఘటనలో నలుగురు గాయపడ్డారు. అపార్ట్మెంటులోని 1,608 ప్లాట్లో వంటగ్యాసు లీకయ్యి మంటలు వ్యాప్తించాయి.
ప్రమాదంలో వినీత్ (25), విష్ణు (20), దొంగరి ప్రదీప్ (26), భార్గవ (26) గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని నిజాంపేటలోని ఎస్ఎల్జీ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: Youth Gang War in LB Nagar : హైదరాబాద్లో గ్యాంగ్ వార్.. యువకుడు మృతి