ETV Bharat / crime

పండగ నింపిన విషాదం.. పిడుగు పాటుకు ముగ్గురు స్నేహితులు మృతి - Warangal crime news

Warangal due toThunder: వరంగల్​ జిల్లాలో దసరా పండగ పూట ఐదు కుటుంబాల్లో తీరని విషాదం జరిగింది. సరదాగా మద్యం తాగేందుకు గ్రామం బయటికి వెళ్లిన ఐదుగురు స్నేహితులపై పిడుగు మృత్యువు రూపంలో కాటేసింది. ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో కూడా పిడుగు పడి ఒకరు మృతి చెందారు.

Warangal due toThunder
Warangal due toThunder
author img

By

Published : Oct 6, 2022, 1:09 PM IST

Warangal due toThunder: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పిడుగులు పడి నలుగురు మృతి చెందారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురంలో పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలొదిలారు. దసరా సందర్భంగా గ్రామ శివారులో మిత్రులతో కలిసి మద్యం సేవిస్తున్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడి సాయి, శివ కృష్ణ, సాంబరాజు మృత్యువాతపడ్డారు. పిడుగుపడిన సమయంలో మొత్తం ఐదుగురు ఉండగా.. అందులో ముగ్గురు మరణించారు.

మరో ఇద్దరికి గాయాలు కావడంతో వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గార్లలో పిడుగుపడి ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. భారీగా వర్షం పడుతుండడంతో చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డారు. పిడుగుపడడంతో.. వేముల సంపత్ అనే యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శేఖర్, విజయ్‌ అనే ఇద్దరిని చికిత్స కోసం ఖమ్మం తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.