ETV Bharat / crime

పిడుగుల పంజాకు నలుగురు బలి.. అందరూ పొలాల్లోనే.. - telangana rains

పిడుగుల పంజాకు రాష్ట్రంలో నలుగురు బలయ్యారు. కుమురం భీం జిల్లాలో తల్లి, ఆరేళ్ల బాలుడు మృతి చెందగా.. పదేళ్ల కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లాలో ఓ ఇంటర్‌ విద్యార్థి పిడుగుపాటుకు బలైంది. నిజామాబాద్‌ జిల్లాలో ఓ రైతు మరిణించాడు. ఈ మూడు ఘటనల్లో.. అందరూ పొలం పనుల్లో ఉండగానే విషాదం చోటుచేసుకుంది.

four died with thunderstorm in three different districts

author img

By

Published : Jun 20, 2022, 5:40 AM IST

తొలకరి పలకరించడంతో పొలం పనుల్లో ఉన్న మూడు రైతు కుటుంబాల్లో పిడుగులు విషాదం నింపాయి. మూడు జిల్లాల్లో ఆదివారం జరిగిన ఈ ఘటనల్లో తల్లి- ఆరేళ్ల బాలుడు, ఇంటర్‌ విద్యార్థి, మరో రైతు మృత్యువాత పడ్డారు. కుమురం భీం జిల్లా వాంకిడి మండలం ఇంధానిలో రైతు సెండె బడిరాం దంపతులు తమ పొలంలో పత్తి విత్తనాలు విత్తేందుకు వెళుతూ కుమార్తె, కుమారుడిని వెంట తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం మొదలవడంతో తల దాచుకునేందుకు చేనులోని చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడటంతో బడిరాం భార్య నాగుబాయి(32), కుమారుడు విష్ణు(6) అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు అంజలి(10), బంధువులు సంగీత, సేవంతాబాయి, రేణుకలు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసిఫాబాద్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంజలి పరిస్థితి విషమంగా ఉండటంతో కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. తల్లీకుమారుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

.

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన గుడిమెట్ల సీతారాములు, గౌరమ్మ దంపతుల ఏకైక సంతానం వేణు(17) ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పూర్తిచేశాడు. సెలవు రోజుల్లో వ్యవసాయ పనులకు వెళుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై చనిపోయాడు. కడుపు శోకం మిగిల్చావా దేవుడా అంటూ వేణు తల్లి గౌరమ్మ రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.

.

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కుకునూర్‌కు చెందిన పిప్పెర రాజు(37) తన పొలంలో పసుపు విత్తనం విత్తి.. కాలువ పనిచేస్తుండగా వర్షం మొదలవడంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మరణించారు. రాజు తండ్రి రాజన్న పన్నేండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా.. రాజు పెద్ద కుమారుడు పదేళ్ల క్రితం నీటి ట్యాంకులో పడి మృతి చెందాడు. చిన్న కుమారుడు వికలాంగుడు. ఉన్న నాలుగెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజు.. పిడుగు పాటుకు కన్నుమూయడంతో ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.