ETV Bharat / crime

ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి - Four killed in road accident in Anantapuram

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.

four-died-in-road-accident-in-front-of-kia-industry-in-anantapuram
ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి
author img

By

Published : Mar 2, 2021, 4:40 AM IST

ఏపీలోని అనంతపురం జిల్లా ఎర్రమంచిలో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాన గేటు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారు బెంగుళూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుంది.

ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మనోజ్ విట్టల్, అతనితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మద్యం మత్తులోనే ప్రమాదం జరిగిందా..!

ప్రమాదానికి గురైన కారులోని వాహనచోదకుడు చేతిలో బీరు సీసా ఉంది. నుజ్జు అయినా కారులోని మృతదేహాలను తొలగించటానికి యంత్రాల ద్వారా పనులు నిర్వహిస్తుండగా... చేతిలో మద్యం సీసా లభించింది. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: స్క్రాచ్‌ కార్డు చీటింగ్​ ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.