ETV Bharat / crime

బ్లాక్​లో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ల అమ్మకం.. నలుగురి అరెస్ట్​ - remdeciver injections in block at kapra

కరోనా బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు మందులు, ఇంజక్లన్లు బ్లాక్‌లో అమ్ముతున్నారు. కుషాయిగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఇలాంటి దందా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బ్లాక్​లో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ల అమ్మకం

author img

By

Published : May 1, 2021, 4:27 AM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పోలీస్​స్టేషన్ పరిధిలోని కాప్రా వద్ద రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​లు బ్లాక్​లో అమ్ముతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 5 రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​లు, రెండు మొబైల్​ ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు ఇంజక్షన్​లను రూ.35 వేలకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు వారిని రిమాండ్​కు తరలించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: నకిలీ రెమ్‌డెసివిర్‌ ఘటనపై కలెక్టర్ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.