హైదరాబాద్‌లో పంజాగుట్ట పీఎస్ పరిధిలో సుమారు నాలుగేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానిక ద్వారకపురి కాలనీలో ఓ దుకాణం ముందు బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవపరీక్ష కోసం బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అయితే చిన్నారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. బాలికది సహజ మరణమా? లేక ఎక్కడైనా చంపేసి ఇక్కడ పడేసి వెళ్లారా? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఓ దుకాణం ముందు పాప మృతదేహం ఉండటంతో ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు బాలికకు సంబంధించి ఎవరూ పోలీసులను ఆశ్రయించలేదు. చుట్టుపక్కల పీఎస్‌లలో మిస్సింగ్ కేసులేమైనా నమోదయ్యాయా అని పంజాగుట్ట పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి: 'అమ్మా నన్ను క్షమించు.. నీ గుడిలో దొంగతనం చేసినందుకు'
Road accident: బంధువులకు వీడ్కోలు చెప్పి వస్తుండగా ప్రమాదం.. చిన్నారి మృతి
Fire accident: చెప్పుల కార్ఖానాలో అగ్ని ప్రమాదం.. రూ. 8 లక్షల ఆస్తి నష్టం.!