RED SANDALWOOD SMUGGLING: ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.30 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లాకు చెందిన బొడ్డే విశ్వనాథ్, ఈశ్వర్ అనే బడా స్మగ్లర్లతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇద్దరు బడా స్మగ్లర్లపై గతంలో ఒక్కొక్కరిపై ఆరు కేసులు ఉన్నాయని.. వారిపై పీడీ యాక్టు కూడా నమోదుచేస్తున్నామని చెప్పారు. నిందితుల నుంచి 500 కిలోల ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా ఎర్రచందనం అక్రమ రవాణాపై సమాచారం వస్తే.. వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
కడప జిల్లా పోలీసులు మంచి వర్క్ కనబరిచారు. సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి 9 గంటలకు వెహికల్ చెకింగ్ చేశారు. రెండు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని చెక్ చేస్తే... అందులో 16 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. వాటిని సీజ్ చేశాం. ఆ కార్లో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. వారిలో బొడ్డె విశ్వనాథ్, ఈశ్వర్లు పాత నేరస్థులు. ఇద్దరిపైనా దాదాపు ఆరు కేసులు ఉన్నాయి. వీరిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. దీనితో సంబంధం ఉన్న ఇతరుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం. రూ.30 లక్షలు విలువ చేసే 500 కేజీల 16 ఎర్రచందనం దుంగలు, రెండు ఫోర్ వీలర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. వీరిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరుస్తాం.
- అన్బురాజన్, ఎస్పీ
ఇదీ చూడండి: Cyber Crime case : సైబర్ చీటర్స్కు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్