మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పీఎస్ పరిధిలోని మల్లికార్జున నగర్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసిన గోదాంపై పోలిసులు దాడులు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అక్కడ నిల్వ ఉన్న 19 కిలోల రేషన్ బియ్యాన్ని, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో తక్కువ ధరలకు రేషన్ బియ్యాన్ని కొని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని పోలీసులు వివరించారు. ఇలా ఇంకెవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!