సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామ శివారులోని మల్లన్న గుడి వద్ద కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలు, గాయపడ్డ వ్యక్తిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతులు నల్గొండ జిల్లా బీబీనగర్‌కు చెందిన సమ్మయ, స్రవంతి, లోకేశ్, రాజమణి, భవ్యశ్రీగా పోలీసులు గుర్తించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని స్వస్థలానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ చూడండి..
ఎలుక ఎంత పని చేసింది.. ఆ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రాణాపాయం