హైదరాబాద్లోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఉబర్ కారులో మంటలు చెలరేగాయి. ఇద్దరు ప్రయాణికులతో మలక్పేట్ నుంచి అమీర్పేట్ వెళ్తుండగా ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి కారు ఇంజిన్లో నుంచి దట్టమైన పొగలు, మంటలు వచ్చాయి.
అక్కడే ఉన్న సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు మొత్తం దగ్ధమైంది. ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. ఇద్దరు ప్రయాణికులను మరో వాహనంలో పంపేశారు.
ఇదీ చూడండి: ఇరువర్గాల దాడి.. ఒకరికి తీవ్ర గాయాలు