ETV Bharat / crime

Fire accident : ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్నిప్రమాదం... ఎగిసిపడ్డ మంటలు - fire accident in krishna district

ఏపీ కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెంపల్లి దగ్గర టవల్స్ కంపెనీలో ఘటన చోటుచేసుకుంది. రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పారు.

Fire accident
Fire accident
author img

By

Published : Sep 3, 2021, 3:08 PM IST

ఏపీ కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని ఓ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. తెంపల్లి వద్ద గల టవల్స్ కంపెనీలో వేకువజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. స్థానిక ప్రజలంతా ఏమవుతుందో తెలియక విపరీతంగా భయపడిపోయారు. ప్రమాద విషయం గుర్తించిన స్థానికులు, కంపెనీ యజమానికి, పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.

హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది... రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పారు. ప్రమాద సమయంలో కార్మికులెవరూ లోపల లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఈ కంపెనీలో ప్లాస్టిక్ బ్యాగులతో పాటు టవల్స్​ను తయారు చేస్తారు. అవన్నీ కాలి బూడిదైపోయాయి. కోట్లలో ఆస్తినష్టం జరిగిందని యజమాని చెబుతున్నాడు. ప్రమాదం వాటిల్లడానికి గల కారణాలపై ఆత్కూరు ఎస్సై శ్రీనివాస్ ఆరా తీస్తున్నారు.

ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్నిప్రమాదం... ఎగిసిపడ్డ మంటలు

ఇదీ చూడండి: pension problems in ap: ఇంట్లో రెండు పింఛన్లుంటే.. ఒక్కరికే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.