రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్ చెరువు కట్టపై ఆర్టీసి బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్, కండక్టర్లు వెంటనే అప్రమత్తమై 40 మంది ప్రయాణికులను బస్లో నుంచి దింపేశారు.
స్థానికులు మంటలను ఆర్పేయటంతో ప్రమాదం తప్పింది. బస్సు ఇబ్రహీంపట్నం నుంచి సికింద్రబాద్ జేబీఎస్ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి: బైక్ స్కీమ్ పేరుతో రూ. 54 లక్షలు మోసం..