హైదరాబాద్ మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కట్టల్గూడలోని ఓ చెప్పుల తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొద్దిక్షణాల్లోనే అవి తీవ్రరూపం దాల్చడంతో వెంటనే స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానిక డబీర్‌పుర కార్పొరేటర్ అలందార్ వాలజాహి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దాదాపు రూ.7 నుంచి 8లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: Bandi Sanjay: రేపటి నుంచే రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలి.. లేదంటే...