మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద అరబిందో ఫార్మాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని బాయిలర్‌లో మంటలు చెలరేగాయి. బాయిలర్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి.
అప్రమత్తమైన ఫార్మా సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. సాంకేతిక లోపంతో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో శశాంక్ గోయల్ భేటీ