ETV Bharat / crime

టపాసులు పేల్చడంతో సెల్‌టవర్‌కు మంటలు.. అపార్ట్‌మెంట్ వాసులపై కేసు నమోదు

Fire Accident due to bursts Firecrackers: దీపావళి సందర్భంగా దీపకాంతులు, బాణసంచా సంబరాలతో పాటు కొన్ని చోట్ల విషాదాలు మిగిలాయి. ప్రతి సంవత్సరం టపాకాయలు కాల్చే సమయంలో ఆనందోత్సవాలతో పాటు ప్రమాదాలు జరిగాయి. అలాగే నిన్న రాత్రి బాణసంచా పేల్చడంతో నగరంలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

Fire Accident
Fire Accident
author img

By

Published : Oct 25, 2022, 12:32 PM IST

Fire Accident due to bursts Firecrackers: దీపావళి అనగానే అందరి టపాసులే గుర్తుకువస్తాయి. చిన్న నుంచి పెద్దల వరకు ఎంతో ఆనందంగా టపాసులు కాలుస్తూ ఎంజాయ్‌ చేస్తారు. నగరంలో దీపావళి వేళ టపాసులు కాల్చుతూ కొంత మంది ప్రమాదానికి గురైతే.. మరికొన్ని చోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఎస్‌ఆర్ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మోతీనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ వాసులు నిన్న రాత్రి పండగవేళ ఆనందోత్సవాలతో బాణసంచా పేల్చుతూ సంబరాల్లో మునిగిపోయారు. కానీ అది కాస్త అగ్నిప్రమాదానికి దారి తీసింది.

Fire Accident
సెల్‌టవర్‌ వద్ద బాణాసంచాలు పేల్చడంతో ప్రమాదం

నోబుల్‌ అపార్ట్‌మెంట్‌పై ఉన్న సెల్‌ టవర్‌పై బాణాసంచా నిప్పురవ్వలు పడడంతో షార్ట్‌సర్క్యూట్‌ అయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు, అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్నవారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా బాణాసంచా కాల్చడంతో అపార్ట్‌మెంట్‌ వాసులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.