ETV Bharat / crime

సికింద్రాబాద్​లోని షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం - బన్సీలాల్​పేటలో అగ్నిప్రమాదం

బన్సీలాల్​పేటలోని షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి ఫైర్​ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.

fire-accident-at-shopping-complex-in-secunderabad
సికింద్రాబాద్​లోని షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం
author img

By

Published : Apr 26, 2021, 2:33 PM IST

సికింద్రాబాద్‌ బన్సీలాల్ పేట కూడలిలోని జబ్బార్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ చెప్పుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్​ సర్క్యూట్ మూలంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు.

సికింద్రాబాద్​లోని షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి: ఈ టెక్నిక్స్​ తెలిస్తే జాబ్​ గ్యారంటీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.