మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి సీహెచ్పీలో అగ్నిప్రమాదం జరిగింది. బొగ్గును అన్లోడ్ చేసేందుకు వచ్చిన టిప్పర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మరో లారీకి వ్యాపించగా.. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి.
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే లారీలతో పాటు అందులో ఉన్న బొగ్గు చాలావరకు దగ్ధం అయింది. ఘటనా స్థలాన్ని రామకృష్ణాపూర్ ఎస్సై రవి ప్రసాద్ పరిశీలించారు.
ఇదీ చూడండి: రికార్డు ధర పలికిన పసుపు.. రైతుల హర్షం