ETV Bharat / crime

మామిడి, నిమ్మ తోటకు నిప్పు పెట్టిన దుండగులు

author img

By

Published : Mar 3, 2021, 12:00 PM IST

ఏపీలోని కడప జిల్లా వేంపల్లె మండలం కుమ్మరాంపల్లెలో గుర్తు తెలియని వ్యక్తులు.. ఓ తోటకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మామిడి, నిమ్మ తోటలు కాలిపోయాయి. చెట్లతో పాటు డ్రిప్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు లక్షా యాభై వేల రూపాయలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు.

మామిడి, నిమ్మ తోటకు నిప్పు పెట్టిన దుండగులు
మామిడి, నిమ్మ తోటకు నిప్పు పెట్టిన దుండగులుమామిడి, నిమ్మ తోటకు నిప్పు పెట్టిన దుండగులు

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా వేంపల్లె మండలం కుమ్మరాంపల్లెలో గుర్తు తెలియని దుండగులు.. మామిడి, నిమ్మ తోటకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో అస్లం మహమ్మద్ గౌస్ అనే రైతు మామిడి, నిమ్మ తోటను సాగు చేశాడు. మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తోటకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో.. మామిడి, నిమ్మ చెట్లతో పాటు డ్రిప్ పైపులు కాలిపోయాయి.

స్థానికులు గౌస్​కు సమాచారం ఇవ్వగా.. బాధితుడు తోట వద్దకు వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఎక్కువ కావటంతో పులివెందుల ఫైర్ స్టేషన్​కు సమాచారమందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదువులోకి తెచ్చారు. ఈ ప్రమాదం వల్ల సుమారు లక్షా యాభై వేల రూపాయలు నష్టం జరిగిందని రైతు అస్లం మహమ్మద్ గౌస్ వాపోయారు.

మామిడి, నిమ్మ తోటకు నిప్పు పెట్టిన దుండగులు

ఇదీ చదవండి: 'మత్తు' స్వీట్లు ఇచ్చి రూ.37 లక్షలు దోపిడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.