ETV Bharat / crime

Digital fingerprints: డిజిటల్ వేలిముద్రలతో ఈజీగా దొరికేస్తారు..

Digital fingerprints : దొంగల ఆటకట్టించేందుకు పోలీసులు వేగంగా ఆధునిక సాంకేతిక బాట పడుతున్నారు. సీఐడీలోని ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో తెలుగు రాష్ట్రాల్లో తరచుగా నేరాలకు పాల్పడే 7.82 లక్షల మంది వేలిముద్రలు సేకరించింది. వీటిని సెంట్రల్‌ సర్వర్‌ ద్వారా లైవ్‌ స్కానర్లకు అనుసంధానం చేశారు. అవి జిల్లా పోలీసులకు సైతం అందుబాటులో ఉన్నాయి. జిల్లా పరిధి గస్తీ పోలీసులు పెట్రోలింగ్‌లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన వారి వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఆ వ్యక్తి పాత నిందితుడైతే సర్వర్లో నిక్షిప్తమైన వేలిముద్రలతో సరిపోలి వెంటనే వారి నేర చరిత్ర అంతా గస్తీ పోలీసులకు అందుతుంది. ఏడాది క్రితం ప్రవేశ పెట్టిన ఈ విధానంతో మంచి ఫలితాలు రావడం, నేరస్థులు పట్టుబడుతుండటంతో వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. వికారాబాద్‌ జిల్లాలో ఈ విధానం అములు తీరుతెన్నులపై ఈటీవీ భారత్‌ కథనం.

author img

By

Published : Jul 20, 2022, 7:31 AM IST

Digital fingerprints
Digital fingerprints

Digital fingerprints : నేరం చేసినప్పుడు గతంలో సిరాతో వేలిముద్రలు సేకరించి పోలీసులు రికార్డుల్లో భద్రపరిచే వారు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికారు. డిజిటల్‌ వేలిముద్రలను సేకరిస్తున్నారు. నేర పరిశోధనకు అనువుగా ఫింగర్‌ ప్రింట్‌ లైవ్‌స్కానర్‌, మొబైల్‌ హ్యాండ్‌ చెక్‌ డివైజ్‌ పరికరాలను అందుబాటులోకి వచ్చాయి. వికారాబాద్‌ జిల్లాలోని ముఖ్య పోలీస్‌ ఠాణాలకు ఈ పరికరాలు అందాయి. వీటితో నిందితులను సులువుగా గుర్తించవచ్చు.

Digital fingerprints help to catch criminals : కొత్తగా పట్టుబడిన నేరస్థుల వివరాలను, వేలిముద్రలను ఎప్పటికప్పుడు సెంట్రల్‌ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం డివిజన్‌ హెడ్‌క్వార్టర్లలో ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానం కొద్ది రోజుల్లో ప్రతి పోలీస్‌ఠాణాకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ పట్టణాల్లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇప్పటివరకు 60 మందికిపైగా గుర్తింపు.. రష్యాలో అమలు చేస్తున్న వేలిముద్రల ఆధునిక పరిజ్ఞానం ద్వారా సేకరించిన ‘పాపిలాన్‌ డీఎస్‌-45’ అనే సాప్ట్‌వేర్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఏడాది కిందట హైదరాబాద్‌ పోలీసులతో పాటు దశల వారీగా అన్ని జిల్లాల పోలీసులకు ఈ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించి అందజేశారు.

2007 తరువాత రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడిన వారి నేరాల వివరాలు, ఫొటోలు, వేలి ముద్రలు ఇప్పటికే సాప్ట్‌వేర్‌లో పొందుపర్చారు. జిల్లా కేంద్రంలోని ఫింగర్‌ ఫ్రింట్స్‌ బ్యూరో ఎప్పటికప్పుడు జిల్లా పరిధిలో నమోదవుతున్న డేటాను పరిశీలిస్తూ పొందుపరుస్తోంది. సిబ్బందికి అవసరమైన సూచనలిస్తోంది. ఏడాది కాలంగా ఈ విధానం ద్వారా 60 మందికిపైగా నిందితులను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కొద్ది రోజుల కిందట వికారాబాద్‌ పోలీసులు రాత్రివేళ పెట్రోలింగ్‌లో భాగంగా అటుగా వెళ్తున్న అనుమానితులను నిలువరించారు. వారిలో ఒకతని వేళ్లను ‘మొబైల్‌ హ్యాండ్‌ చెక్‌ డివైజ్‌’ అనే పరికరంపై ఉంచగా వెంటనే అతని స్వగ్రామం కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా అని, గతంలో వికారాబాద్‌, తాండూర్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు నేర సంఖ్య, సెక్షన్‌, పోలీస్‌ఠాణా పరిధి తదితర పూర్తి వివరాలన్నీ క్షణాల వ్యవధిలో తెలిసిపోయాయి. దీంతో అతన్ని స్థానిక పోలీస్‌ఠాణాకు తరలించి విచారించారు.

ఇటీవల ఇతర జిల్లాల్లో ఇద్దరు దారి దోపిడీ దొంగలు అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. పూర్తి స్థాయిలో విచారించగా, గత జనవరిలో దారి దోపిడీ చేసినట్లు ఒప్పుకున్నారు. వెంటనే ఈ ఇద్దరి వేలిముద్రలు, ఫొటోలు లైవ్‌ స్కానర్‌ పరికరంలో నిక్షిప్తం చేసి సెంట్రల్‌ సర్వర్‌కు అనుసంధానం చేసి ఇతర జిల్లాల పోలీసులకు అప్పగించారు. వీరు భవిష్యత్తులో ఎక్కడ ఎలాంటి నేరానికి పాల్పడినా వేలిముద్రల సాయంతో దొరికిపోయే అవకాశం ఉంది.

మంచి ఫలితాన్నిస్తోంది.. "ఆధునిక సాంకేతిక విధానం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఎక్కడైనా నేరం జరగగానే అక్కడ సేకరించిన వేలిముద్రలను పాపిలాన్‌ సాప్ట్‌వేర్‌కు అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం లక్షలాది వేలిముద్రల్లో నిందితుల వేలిముద్రలను సరిపోల్చుకోవడం నిముషాల వ్యవధిలోనే పూర్తవుతోంది. మారుమూల పోలీసులకు సైతం ఈ విధానాన్ని అమలుచేసే విధంగా అవగాహన కల్పిస్తున్నాం." - రాజశేఖర్‌, సీఐ, వికారాబాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.