ETV Bharat / crime

భార్యపై కోపంతో పిల్లలను కాలువలో పడేసిన తండ్రి - కషాయ తండ్రి

Father Pushed Two Childrens Into Canal: కన్నతల్లికి పిల్లల మీద ఎంత మమకారం ఉంటుందో.. తండ్రికి అంతే ఉంటుంది. పిల్లల ఆలనాపాలన తల్లి చూసుకుంటే.. వారి అవసరాలను తండ్రి తీరుస్తాడు. అటువంటి తండ్రి తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి కాలువలో పడేశాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారులు.. తండ్రి చేసిన ఘాతుకానికి బలయ్యారు. ఇదంతా కేవలం భార్య మీద కోపంతోనే చేయడం దారుణం.

children into canal breaking
children into canal breaking
author img

By

Published : Sep 20, 2022, 8:12 PM IST

Father Pushed Two Childrens Into Canal: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తి తన భార్య జ్యోతిపై గత కొద్దిరోజులుగా కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం వెంకటేశ్‌ తన పిల్లలు జ్యోత్స్న(6), షణ్ముఖ వర్మ(4)లను తాడేపల్లి బకింగ్ హామ్ కెనాల్‌లో పడేసి వెళ్లిపోయాడు. సోమవారం సాయంత్రం నుంచి తన పిల్లలు కనిపించడం లేదని.. జ్యోతి పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి.. బకింగ్ హామ్ కెనాల్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. శవపంచానామ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.