ETV Bharat / crime

కొడుకును ఆర్టీసీ బస్సులో వదిలేసిన తండ్రి! - గుమ్మడిదల తాజా వార్తలు

తన కుమారుడిని ఆర్టీసీ బస్సులో వదిలేశాడో తండ్రి. ఎందుకు తనను వదిలి వెళ్లాడో తెలియని ఆ బాలుడు బస్సులోనే ఉండిపోయాడు. ఏడుస్తుండగా గమనించిన ఆర్టీసీ సిబ్బంది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీసులకు అప్పగించారు.

sangareddy news, telangana news
sangareddy news, telangana news
author img

By

Published : May 9, 2021, 3:49 PM IST

కన్నకొడుకుని బస్సులో వదిలి వెళ్లిన సంఘటన ఇది. మెదక్ జిల్లా నర్సాపూర్​లో పాపయ్య, అతని కుమారుడు బన్ను(10) ఆర్టీసీ బస్సు ఎక్కారు. మధ్యలోనే తండ్రి దిగిపోవడం వల్ల ఆ బాలుడు బస్సులోనే ఉండిపోయాడు. ఏడుస్తూ ఉండటం గమనించిన ఆర్టీసీ సిబ్బంది బాలుడిని గుమ్మడిదల పోలీసులకు అప్పగించారు.

అమీన్​పూర్​లోని అనాథాశ్రమంలో బాలుడిని ఉంచారు. పోలీసుల దర్యాప్తులో బాలుని తండ్రి సంగారెడ్డి జిల్లా పటాన్​చెరుకు చెందినవాడిగా గుర్తించారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బాలుడి బాబాయ్ పోలీస్ స్టేషన్​కు వస్తానని చెప్పారు. అయితే తండ్రి బాలుని వదిలేసి వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి: ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.