ETV Bharat / crime

కోడలిని గొంతు కోసి చంపిన మామ.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. - కోడలిని హత్య చేసిన మామ

Man Kills his Daughter in Law
కోడలిని గొంతు కోసి చంపిన మామ
author img

By

Published : Jan 5, 2022, 12:37 PM IST

Updated : Jan 5, 2022, 3:40 PM IST

12:32 January 05

కురవి మం. సోమ్లా తండాలో మహిళ హత్య

Man Kills his Daughter in Law: మంచిర్యాలలో కోడలిని మామ చంపిన ఘటన మరువక ముందే.. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. సోమ్లా తండాలోని ఓ వ్యక్తి తన కోడలిని అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.

మనుషుల మధ్య సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో తెలిపే ఘటన ఇది. కుమారుడి కాపురాన్ని సరిదిద్దాల్సిన తండ్రి.. వావి వరసలు మరిచి.. కోడలితోనే సంబంధం పెట్టుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత ఆ కోడలు వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుని మామని దూరం పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న మామ.. ఆమె వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. తనను దూరం పెట్టిందనే నిజాన్ని భరించలేకపోయాడు. అదును చూసి.. కోడలి గొంతు కోసి దారుణంగా చంపేశాడు.

సోమ్లా తండాలో హచ్చా, రుక్కమ్మ దంపతులు నివాసముంటున్నారు. వారికి ముగ్గురు కుమారులు. పిల్లలకు వివాహమై.. వేరువేరుగా కాపురం ఉంటున్నారు. రెండో కుమారుడు తల్లిదండ్రులకు దగ్గర్లోనే అదే గ్రామంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే హచ్చాకు.. రెండో కోడలికి మధ్య సంబంధం ఏర్పడింది.

కొన్నాళ్లు అంతా వారు అనుకున్నట్లే జరిగింది. ఈలోపు కోడలు మరొకరితో ప్రేమాయణం సాగించింది. అతని మోజులో పడి మామను దూరం పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న హచ్చా జీర్ణించుకోలేకపోయాడు. నన్ను కాదని.. వేరొకరితో సంబంధం కొనసాగిస్తుందని కోపంతో రగిలిపోయాడు. దీంతో ఆగ్రహించిన మామ.. సమయం కోసం వేచి చూశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె వద్దకు వెళ్లి.. కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. వెంటనే పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: father in law kills daughter in law: కోడలి గొంతు కోసి హత్య చేసిన మామ

Last Updated : Jan 5, 2022, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.