రంగారెడ్డి జిల్లాలో డబ్బుకోసం కొడుకును అమ్మిన తండ్రిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సయ్యద్ హైదర్, అతని సోదరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఇద్దరిని పట్టుకున్నామని తెలిపారు. రెండు రోజుల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. డబ్బు కోసం కుమారుడిని విక్రయించారని వివరించారు.
ఈ నెల 15న 2నెలల చిన్నారిని ఇంట్లో నుంచి తండ్రి సయ్యద్ హైదర్ తీసుకెళ్లాడని తల్లి షహనాజ్ బేగం తెలిపారు. కాసేపటి తర్వాత ఒక్కడే రావడంతో నిలదీయగా అసలు విషయం చెప్పాడని వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి... ఏపీలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం చిన్నారిని తల్లికి అప్పగించనున్నారు.
ఇదీ చదవండి: మీ కుటుంబం విలువ రూ.5 వేల కంటే తక్కువా?