పెద్దపల్లి జిల్లా మంథని మండల పరిధిలో దారుణం జరిగింది. తన కుమార్తెపై అఘాయిత్యం చేస్తున్న యువకుడిని కర్రతో కొట్టే క్రమంలో.. యువతి తీవ్రంగా గాయపడింది. మండల పరిధికి చెందిన ఓ రైతు పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి ఆయన కుమార్తెపై.. సతీశ్ అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. యువతికి పురుగుల మందు తాగించేందుకు ప్రయత్నించాడు.
దీంతో అతడిని కర్రతో కొట్టడానికి తండ్రి ప్రయత్నించగా... యువకుడు తప్పించుకున్నాడు. యువతికి కర్ర బలంగా తాకి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను మొదట మంథని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమిస్తుండటంతో ఆమెను వరంగల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: SATYAVATHI: గత పాలకులది ఓటు రాజకీయం.. తెరాసది సంక్షేమ మార్గం