Farmer Suicide: అన్నదాత సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... వారి ఆత్మహత్యలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ధన్నపేట మండలం నల్లబెల్లికి చెందిన తక్కలపెల్లి రాజేశ్వర్ రావు (36) అనే రైతు ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే రైతు రాజేశ్వర్ రావు మృతి చెందినట్లు వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మృతునికి భార్య సరిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కు మృతి చెందడం వల్ల ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: