ETV Bharat / crime

Mirchi Farmer Suicide: అప్పుల బాధతో మరో మిర్చి రైతు ఆత్మహత్య - farmer suicide in narsapuram thanda

Mirchi Farmer Suicide: ఈ సీజన్‌లో మిర్చి పంట.. రైతులకు కన్నీటినే మిగుల్చుతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు దిగుబడి లేక కొందరు.. పంట చేతికొచ్చే ముందు తెగుళ్లు సోకి మరికొందరు రైతులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో పుడమి తల్లినే నమ్ముకున్న రైతన్నకు అప్పులు తీరే దారిలేక చావే శరణ్యంగా భావించి బలవన్మరణం చెందుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నర్సాపురం తండాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు.

farmer suicide
నర్సాపురంలో రైతు ఆత్మహత్య
author img

By

Published : Jan 20, 2022, 4:28 PM IST

Mirchi Farmer Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నర్సాపురం తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటకు దిగుబడి సరిగా రాకపోవడంతో తండాకు చెందిన రైతు భూక్యా బాలాజీ(40).. అదే పొలంలో ఆత్మహత్యాయత్నం చేశారు. పండుగ పూట ఇంట్లో వాళ్లకి విషాదం మిగల్చకూడదని ఆ రైతు భావించారో ఏమో.. బాధలన్నీ కడుపులోనే దిగమింగుకుని భార్యాపిల్లలతో సంతోషంగా గడిపి పండుగ మరుసటి రోజు బలవన్మరణానికి యత్నించారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి నేడు తుదిశ్వాస విడిచారు.

farmer suicide
మృతి చెందిన రైతు భూక్యా బాలాజీ

అప్పులు తీరే మార్గం లేక

రైతు భూక్యా బాలాజీ.. తనకున్న కొద్దిపాటి పొలంలో మిర్చి పంట వేశారు. ఆ పంటకు తెగుళ్లు రావడం, వర్షాలు పడి ఉన్న పంట దెబ్బ తినడంతో దిగుబడి తగ్గిపోయింది. దీంతో అప్పులు ఎక్కువై.. అవి తీరే మార్గం లేక చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సంక్రాంతి పండుగ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి.. అనంతరం దెబ్బతిన్న పంట చేలు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. నాలుగు రోజుల పాటు పలు చోట్ల చికిత్స పొందిన రైతు.. చివరికి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందారు.

farmer suicide
ఆవేదనలో రైతు భూక్యా బాలాజీ కుటుంబం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

దహన సంస్కాారాలకు డబ్బులు లేక

పండుగ పూట తమతో సంతోషంగా గడిపిన తండ్రి.. నిర్జీవంగా ఇంటికి రావడంతో ఆ రైతు పిల్లలు, భార్య శోక సంద్రంలో మునిగిపోయారు. దహన సంస్కారాలకు సైతం డబ్బులు లేకపోవడంతో.. దాతల సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. పలు పార్టీల నాయకులు, గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: బోర్లించి ఉన్న దేవుని పటాలు... కూతురితో పాటు దంపతుల మృతదేహాలు.. అమీన్​పూర్​లో మిస్టరీ డెత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.