కాళేశ్వరం లింక్-2 పనుల్లో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని జగిత్యాల జిల్లా వెల్గటూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట రాజక్కపల్లెకు చెందిన నిర్వాసిత రైతు దొరిసెట్టి శ్రీనివాస్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు గమనించి అడ్డుకున్నారు.
భూములు కోల్పోతున్న వారికి న్యాయం జరిగే వరకు తమ ఆందోళన ఆగదని రైతులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: పట్టా భూములపై వక్ఫ్ గెజిట్ జారీ.. రైతుల్లో ఆందోళన..