ETV Bharat / crime

పిడుగుపాటుకు అన్నదాత బలి.. విషాదంలో కుటుంబం

పిడుగుపాటుకు గురై రైతు మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాయన్నపల్లిలో జరిగింది. రైతు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పిడుగుపాటుకు అన్నదాత బలి.. విషాదంలో కుటుంబం
పిడుగుపాటుకు అన్నదాత బలి.. విషాదంలో కుటుంబం
author img

By

Published : Apr 25, 2022, 8:43 PM IST

అకాల వర్షంతో ఒక అన్నదాత పిడుగుపాటుకు గురై మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం సాయన్నపల్లిలో చోటుచేసుకుంది. తన పొలంలో మొక్కజొన్న పంట కుప్పకు పట్టా కప్పేందుకు వెళ్లి గాలి వాన తీవ్రతకు బావి గట్టు వద్దకు వచ్చిన తొలెం లక్ష్మయ్య (35) ఒక్కసారిగా పిడుగు పడటంతో బావిలో పడి చనిపోయాడు. స్థానిక రైతులు ఆయనను బావిలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రైతు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. పేద రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. మరో వైపు గుండాల మండలంలో తీవ్రమైన ఈదురుగాలులు, వర్షంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పలు చోట్ల విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్లు, విద్యుత్​ స్తంభాలు కింద పడిపోయాయి. ఈదురుగాలులకు పలు ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఈ గాలుల వల్ల స్థానికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కిందపడిన విద్యుత్​ స్తంభాలు
కిందపడిన విద్యుత్​ స్తంభాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.