Farmer Sucide In Hanumakonda: హనుమకొండ జిల్లా దామెర మండలం లాదెళ్ల గ్రామంలో అప్పుల బాధతో.. ఆకునూరి విజయ్ కుమార్ (41) శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం విజయ్ కుమార్ తనకున్న భూమితో పాటు కొంత కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు.
అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. గత సంవత్సరం అకాల వర్షాలతో పంట దెబ్బతినగా ఈ సంవత్సరం సరైన దిగుబడి రాక ఆర్థిక ఇబ్బందులతో మనోవేదన గురైన విజయ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవీ చదవండి: