రంగారెడ్డి జిల్లా పహడి షరీఫ్ ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి అదృశ్యమైంది. జహుర్ ఉల్లాహ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి పహడి షరీఫ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అతని భార్య అయేషా, పిల్లలు అలీ బాబ-7, జోహారా ఫాతిమా-5, సుల్తాన్-2తో కలిసి దర్గాకు వెళ్తున్నానని చెప్పి శనివారం బయటకు వెళ్లి... ఇంటికి తిరిగి రాలేదని జహుర్ ఉల్లాహ్ తెలిపారు.
బంధువుల దగ్గర వెతికినా ఆచూకీ లేదని... పోలీసులకు ఆమె భర్త ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పహడి షరీఫ్ పోలీసులకు తెలపాలని కోరారు.
ఇదీ చదవండి: వాహనాలను అపహరించే దొంగల ముఠా అరెస్ట్