పేటీఎం యాప్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గురగావ్కు చెందిన హితేష్ వర్మ సాఫ్ట్వేర్ ఇంజినీర్. సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో నకిలీ పేటీఎం యాప్‌ను సృష్టించాడు. అమాయకులకు వల వేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇతని మోసాలను గ్రహించిన పేటీఎం యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పేటీఎం యాప్ పేరుతో ఆన్లైన్లో అనేక నకిలీ యాప్‌లు సృష్టించి డబ్బు సొమ్ము చేసుకుంటున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: లాటరీలో కారు గెలుచుకున్నారంటూ... ఐదు లక్షలు కాజేశారు