ETV Bharat / crime

FAKE GUN PRANK: డబ్బులిస్తారా.. కాల్చేయాలా?

author img

By

Published : Sep 2, 2021, 9:06 AM IST

'యూట్యూబ్​లో కుకింగ్ వీడియోలు ఎవరూ చూస్తారురా? ప్రాంక్​ వీడియోలు చేద్దాం. లక్షల్లో వ్యూస్​ వస్తాయ్​' ఇది ఓ సినిమాలో డైలాగ్. అవును ప్రాంక్​ వీడియోలకు వచ్చే వీక్షణలు... మరే వీడియోలకు అంత త్వరగా రావు. ఇదో రకమైన ట్రెండ్​. ఈ చిట్కానే ఫాలో అవుతూ కొందరు ప్రాంక్​ వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ కొందరు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ... మారణాయుధాలతో ప్రాంక్​లు చేస్తూ... సామాన్యులను బెదిరిస్తున్నారు.

FAKE GUN PRANK
మారణాయుధాలతో ప్రాంక్​లు

ప్రాంక్‌.. ఇప్పుడు నగరంలో ఇదో ట్రెండు. చేతిలో ఓ ఫోను పట్టుకొని రోడ్డెక్కి.. వచ్చిపోయేవాళ్లను ఆట పట్టిస్తే యూట్యూబ్​లో లక్షల్లో వీక్షణలు.. లైకులు.. సంపాదన. ఇది కాస్త పిచ్చిగా ముదురుతోంది. తక్కువ కాలంలో ఎక్కువ వీక్షణల కోసం ప్రాంక్‌స్టర్లు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఇన్నాళ్లూ ఆటపట్టించడానికి పరిమితమవగా ఇప్పుడు ఏకంగా మారణాయుధాలతో బెదిరింపులతో సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

బుధవారం ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఓ యువకుడు పలు ప్రాంతాల్లో తుపాకీతో ప్రాంక్‌ చేశాడు. అటుగా వచ్చిపోయే వారిని డబ్బులివ్వాలంటూ బెదిరిస్తూ భయాందోళనకు గురిచేశాడు. నగరంలో పలు ప్రాంతాల్లో జరిగిన ఈ వీడియో చిత్రీకరణపై నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలంగాణ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెలలో ‘హైదరాబాద్‌ సిటీ’ పేరుతో ఉన్న మరో ఖాతాలోనూ ఈ తుపాకీ ప్రాంక్‌ చేయడం గమనార్హం.

అత్యుత్సాహం చూపిస్తే..

ఇటీవలే ప్రాంక్​ వీడియోలు చేస్తూ ఓ యువకుడు దుకాణ యజమానితో గొడవకు దిగాడు. ‘హైదరాబాదీ ప్రాంక్స్’ యూట్యూబ్ ఛానెల్ యాంకర్ ఇమ్రుస్ షేక్.. ప్రాంక్ వీడియోలో భాగంగా షాప్ యజమానితో గొడవకు దిగాడు. గొడవ పెద్దది కావడంతో ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్‌ని చితకబాదాడు. అప్పటికే ఆవేశానికి లోనైనా షాప్‌ యజమాని ఇది ప్రాంక్ వీడియో అని చెప్పినా వినకుండా యాంకర్‌ను మరింత కసిగా కొట్టాడు. విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

యూట్యూబర్ల కోసం

నిడివి తక్కువ ఉండి.. కేవలం 5 నిమిషాల్లోనే నవ్వు తెప్పించే కంటెంట్ ఉండే ప్రాంక్ వీడియోలంటే నెటిజన్లకు మక్కువ ఎక్కువ. అలా అని ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వీడియోలు తీయడం కరెక్ట్ కాదు. వీడియోలు నవ్వితెప్పించేవిలా ఉంటే క్లిక్​ అవుతాయి. ప్రజలు కూడా సపోర్ట్​ చేస్తారు. ఇలా భయపెట్టి మాత్రం వ్యూస్​ సంపాదించుకోవాలి అనుకుంటే.. పోలీసులు రంగంలోకి దిగుతారు జాగ్రత్త.

ఇదీ చూడండి: Prank Video Failed : ప్రాంక్ వీడియో కాస్త.. ఫైట్ వీడియో అయింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.